పాక్‌ ప్రియుణ్ణి పెళ్లాడిన యూపీ మహిళ | Women Travelled to Pakistan From Thane | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రియుణ్ణి పెళ్లాడిన యూపీ మహిళ

Jul 24 2024 1:14 PM | Updated on Jul 24 2024 1:14 PM

Women Travelled to Pakistan From Thane

ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటుతున్న వారి జాబితాలో ఇప్పుడు యూపీకి చెందిన నగ్మా చేరింది. ఇటువంటి ఉదంతాలు అటు పోలీసులకు, ఇటు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని థానేకు చెందిన పోలీసులు తాజాగా 24 ఏళ్ల మహిళను విచారిస్తున్నారు. ఆమె గత మే నెలలో పాకిస్తాన్ వెళ్లి, తరువాత ముంబైకి తిరిగి వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. నగ్మా తన బిడ్డతో సహా పాకిస్తాన్ వెళ్లినట్లు పోలీసులకు తెలియవచ్చింది. అయితే ఆ మహిళ నకిలీ పత్రాలు, మారుపేరుతో పాకిస్తాన్‌కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నకిలీ పత్రాలను ఉపయోగించి పాస్‌పోర్ట్, వీసా పొందడంలో నగ్మాకు సహాయం చేసిన వారికోసం  పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆమె తాను పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నానని, అతనిని పాకిస్తాన్‌లో పెళ్లి  చేసుకున్నానని ఆమె తెలిపింది. ఈ  నేపధ్యంలో ఆమె వివాహ ధ్రువీకరణ పత్రం కూడా పోలీసులకు దొరికింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగ్మా స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఆమె ఉద్యోగరీత్యా థానేలో  ఉంటోంది. ప్రస్తుతం పోలీసులు నగ్మా డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement