చిన్నారుల్లో ఒబెసిటీ.. WHO కీలక ప్రకటన | WHO makes key announcement regarding childhood obesity | Sakshi
Sakshi News home page

చిన్నారుల్లో ఒబెసిటీ.. WHO కీలక ప్రకటన

Oct 7 2026 7:32 PM | Updated on Oct 7 2026 7:45 PM

WHO makes key announcement regarding childhood obesity

ఒబెసిటీ మందులపై WHO కీలక ప్రకటన చేసింది. పదేళ్ల లోపు చిన్నారులకు ఈ మందులు ఎట్టిపరిస్థితుల్లో వాడవద్దని తెలిపింది. ఒబెసిటీ మెడిసిన్స్‌ ఫలితాలపై ఇప్పటి వరకూ స్పష్టమైన ఆధారాలు ఏమి లేవని పేర్కొంది.10 ఏళ్లలోపు పిల్లలకు బరువు తగ్గించే ఒబెసిటీ మందులు (GLP-1 ఇంజెక్షన్లు) లేదా బేరియాట్రిక్ సర్జరీలు చేయకూడదని డబ్ల్యూహెచ్‌ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ అంశమై  చిన్న పిల్లల్లో ఈ మందుల దీర్ఘకాలిక ప్రభావాలు మరియు భద్రతపై సరైన ఆధారాలు లేవని పేర్కొంది. అందుకే  చిన్న పిల్లల్లో బరువు తగ్గడానికి కేవలం పోషకాహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులపైనే దృష్టి పెట్టాలని సూచించింది. అదే  10 నుండి 19 ఏళ్ల మధ్య వయసున్న యుక్తవయస్కులకు అన్ని రకాల జీవనశైలి మార్పులు విఫలమైనప్పుడు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులను పరిశీలించవచ్చని తెలిపింది.

ఒబెసిటీ సమస్యను కేవలం మందుల ద్వారా మాత్రమే పూర్తిగా నిర్మూలించలేమని ఈ మందులతో పాటు సరైన ఆహార నియమాలు , శారీరక శ్రమ (Exercise) తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. టైప్-2 డయాబెటిస్, ఒబెసిటీ నియంత్రణకు వాడే కొన్ని కీలకమైన GLP-1 క్లాస్ మందులను డబ్ల్యూహెచ్‌ఓ తన అత్యవసర ఔషధాల జాబితా లోచేర్చింది. ఈ మందుల ధరలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉన్నందున, పేద దేశాలకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చేలా ధరలను తగ్గించాలని జెనరిక్ మందుల తయారీని ప్రోత్సహించాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది.

నకిలీ మందులపై హెచ్చరిక

మార్కెట్లో ఒబెసిటీ, డయాబెటిస్ మందులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో నకిలీ మందులు చలామణి అవుతున్నాయని, కనుక రోగులు గుర్తింపు పొందిన వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే అధీకృత ఫార్మసీల నుండి వీటిని కొనుగోలు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

ఇదీ చదవండి: తలపట్టుకుంటున్న ట్రంప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement