
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదలైంది. ఇటీవల విడుదలైన నంబియో క్రైమ్ ఇండెక్స్-2025 ప్రకారం.. అత్యంత సేఫ్టీ నగరాల జాబితాలో భారత్‌లోని పలు నగరాలు చోటు సంపాదించాయి. వాటిలో అహ్మదాబాద్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల సంఖ్య 385గా ఉంది. వీటిలో నంబియో సేఫ్టీ ఇండెక్స్ 68.6 శాతంతో అహ్మదాబాద్ 296 స్థానంతో భారత్ నుంచి తొలిస్థానం దక్కించుకుంది. అహ్మదాబాద్ తర్వాత జైపూర్, కోయంబత్తూరు , చెన్నై, పుణె, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఢిల్లీలు ఉన్నాయి.
ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరం
అబుదాబి (UAE) – 88.8 సేఫ్టీ ఇండెక్స్ స్కోర్‌తో తొమ్మిదవ సంవత్సరం వరుసగా టాప్‌లో ఉంది. ఈ ర్యాంకింగ్స్ నంబియో అనే గ్లోబల్ కక్రౌడ్ సోర్స్ డేటాబేస్ ఆధారంగా రూపొందించింది. ప్రజలు తమ నగరాల్లో నేరాలపై ఉన్న అభిప్రాయాలను, భద్రతా స్థాయిని,పోలీస్ స్పందనను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్లు రూపొందిస్తారు.