breaking news
safest cities
-
భారత్‌లోని అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదల
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదలైంది. ఇటీవల విడుదలైన నంబియో క్రైమ్ ఇండెక్స్-2025 ప్రకారం.. అత్యంత సేఫ్టీ నగరాల జాబితాలో భారత్‌లోని పలు నగరాలు చోటు సంపాదించాయి. వాటిలో అహ్మదాబాద్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల సంఖ్య 385గా ఉంది. వీటిలో నంబియో సేఫ్టీ ఇండెక్స్ 68.6 శాతంతో అహ్మదాబాద్ 296 స్థానంతో భారత్ నుంచి తొలిస్థానం దక్కించుకుంది. అహ్మదాబాద్ తర్వాత జైపూర్, కోయంబత్తూరు , చెన్నై, పుణె, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఢిల్లీలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరంఅబుదాబి (UAE) – 88.8 సేఫ్టీ ఇండెక్స్ స్కోర్‌తో తొమ్మిదవ సంవత్సరం వరుసగా టాప్‌లో ఉంది. ఈ ర్యాంకింగ్స్ నంబియో అనే గ్లోబల్ కక్రౌడ్ సోర్స్ డేటాబేస్ ఆధారంగా రూపొందించింది. ప్రజలు తమ నగరాల్లో నేరాలపై ఉన్న అభిప్రాయాలను, భద్రతా స్థాయిని,పోలీస్ స్పందనను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్లు రూపొందిస్తారు. -
ఆ 12 నగరాల్లో 'ఆమె'కు భద్రత
యత్ర నార్యస్తు పూజ్యంతే అని వేదాలు ఘోషించినా... మహిళా భద్రతకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు కల్పించినా రోజురోజుకూ మహిళలపై క్రైం రేటు పెరుగుతూనే ఉంది. ఎక్కడో అక్కడ మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే మహిళలు ఒంటరిగా టూర్ ఎంజాయ్ చేయాలనుకుంటే... నిశ్చింతగా గడప గలిగే కొన్ని ప్రాంతాలున్నాయి. ఎటువంటి భయాందోళనలకూ తావులేకుండా ఆయా ప్రాంతాల్లో ఆనందంగా, హాయిగా గడిపే అవకాశం ఉంది. మరి ఆ వివరాలేమిటో చూద్దాం. మీరు మహిళలా...! ఒంటరిగా ప్రయాణించాలనుకుంటున్నారా? హాలీడేస్ లో హాయిగా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇంకెందుకాలస్యం... ఎటువంటి అభద్రత లేని, వినోదంతోపాటు సురక్షితంగా విహార యాత్రను పూర్తి చేసుకోగలిగే ప్రపంచవ్యాప్తంగా భద్రమైన నగరాల్లో పన్నెండు నగరాల జాబితాను గుర్తించారు. ఈ ప్రదేశాల్లో మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఉండటమే కాక తక్కువ నేర రేటు ఉండటంతో ఇక్కడ.. మహిళలు ఎటువంటి భయం లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ పన్నెండు నగరాల్లోనూ మంచి ప్రజా ప్రయాణ సౌకర్యాలతో పాటు మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. టోక్యో నగరం... (జపాన్) జపాన్ లోని టోక్యో నగరంలో కొన్ని హోటళ్ళలో మహిళలు నివసించేందుకు ప్రత్యేక గదులుంటాయట. వాటి పేరు క్రైయింగ్ రూమ్స్. అంటే ఏడుపు గదులన్నమాట. వింటేనే ఎంతో ఆనందంగా ఉంది కదూ...! ఆనందంగా ఉండాలంటే బాధను ఎప్పడికప్పుడు బయటకు పంపేయడం ఎంతో అవసరమట. ఇటీవల ఓ సర్వే కూడ ఈ విషయాన్ని నిర్ధారించింది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ నగరంగా పేరొందిన టోక్యో 2015 సంవత్సరంలో సేఫెస్ట్ సిటీగా కూడ గుర్తింపునందుకుంది. అలాగే టోక్యోలో ఎన్నో సందర్శనా స్థలాలు కూడ ఉండటంతో ఇక్కడ విహరించేందుకు మహిళలు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. సియోల్ (సౌత్ కొరియా) సియోల్ ను సందర్శించిన మహిళలు అక్కడి ప్రత్యేకతలకు ఫిదా అయిపోతారు. బాలికలకు వ్యాయామంకోసం హాన్ రివర్ చుట్టూ సైక్లింగ్ ఏర్పాట్లు, మిడ్ నైట్ షాపింగ్, స్పా ట్రీట్ మెంట్లు, సింగింగ్ రూమ్స్, రాత్రంగా ఎటువంటి భయం లేకుండా ఎంజాయ్ చేసే చక్కని ఏర్పాట్లు కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. సేఫెస్ట్ సిటీగా సియోల్ పేరొందింది. అంతేకాదు మహిళలకు ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలను కల్పించడంలో ముందుంది. అలాగే సౌత్ కెనడాలోని టొరొంటో, దుబాయ్, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కో, స్విట్జర్ ల్యాండ్ లోని జురిచ్,నెదర్ ల్యాండ్స్ లోని ఆమ్ స్టర్ డమ్, ఐస్లాండ్ లోని రేక్జావిక్, వియత్నాంలోని హోచి మిన్ సిటీ, న్యూజిల్యాండ్ లోని క్వీన్స్ టౌన్ లు మహిళలకు ప్రత్యేక భద్రతతో పాటు... వినోదానికి, వికాసానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.