నేను రాలేను.. రేవంత్‌కు మమతాబెనర్జీ లేఖ | West Bengal CM Mamata Banerjee letter to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

నేను రాలేను.. రేవంత్‌కు మమతాబెనర్జీ లేఖ

Dec 7 2025 10:12 AM | Updated on Dec 7 2025 12:08 PM

West Bengal CM Mamata Banerjee letter to CM Revanth Reddy

సీఎం రేవంత్‌కు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘సమ్మిట్‌కు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. 

అయితే సమ్మిట్‌ జరుగుతున్న రోజుల్లో ముందే నిర్ణయించిన జిల్లాల పర్యటనల వల్ల నేను రాలేకపోతున్నాను. ఈ సమ్మిట్‌ వేదికగా నిర్మాణాత్మక చర్చలు జరగాలి. సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి అమూల్యమైన ప్రయోజనాలు చేకూరాలి’అని ఆ లేఖలో మమత పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement