న్యూఢిల్లీ: ఇకపై ఢిల్లీలోని పలు చారిత్రక ప్రదేశాలలో వివాహాలు జరుపుకోవడం ఇక కల కానేకాదు.. ఎందుకంటే, త్వరలోనే ఈ అద్భుతమైన కట్టడాలను వివిధ వేడుకల కోసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎంపిక చేసిన వారసత్వ కట్టడాలను పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు బుక్ చేసుకునేందుకు అనుమతించే పథకం ప్రస్తుతం సిద్ధమవుతోందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ ఆర్కియాలజీ శాఖ పరిధిలోని అనేక స్మారక చిహ్నాలను ఇప్పటికే ఎంపిక చేశారు.
నార్తర్న్ రిడ్జ్‌లోని మ్యుటినీ మెమోరియల్ : 1857 తిరుగుబాటులో మరణించిన సైనికులకు గుర్తుగా 1863లో నిర్మితమైంది.
కశ్మీర్ గేట్‌లోని దారా షికో లైబ్రరీ : ఇది ఒకప్పుడు మొఘల్ యువరాజు దారా షికో నివాసం, ఆ తర్వాత బ్రిటిష్ కార్యాలయంగా మారింది.
చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం
మక్బరా పైక్ : మొఘల్ కాలం నాటి సమాధి. ఇది ఇంపీరియల్ కొరియర్‌లలో ఒకరికి చెందినదని భావిస్తున్నారు.
సాధనా ఎన్‌క్లేవ్‌లోని సమాధి : ఇది లోడీ కాలం నాటి నిర్మాణం. ఇది తొలి ఇండో–ఇస్లామిక్ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.
ఖుద్సియా గార్డెన్‌లోని పెవిలియన్లు : 18వ శతాబ్దపు ప్యాలెస్ కాంప్లెక్స్‌లో భాగం. చక్రవర్తి ముహమ్మద్ షా భార్య అయిన ఖుద్సియా బేగం దీనిని నిర్మించారు. వీటితో పాటు, లోడి, సయ్యద్ కాలాల నాటి మధ్యయుగపు సమాధులు, గోడల అవశేషాలున్న వసంత విహార్‌లోని ప్రాంతాలు, ప్రఖ్యాత ఉర్దూ కవి మీర్జా గాలిబ్ నివాసమైన గాలిబ్ హవేలీ (చాందినీ చౌక్), ప్రయాణికుల విశ్రాంతి గృహంగా భావించే 14వ శతాబ్దపు గోపుర నిర్మాణమైన బరా లాయో కా గుంబద్ వంటివి కూడా పెళ్లి వేడుకలకు వేదికలుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వారసత్వ వేదికల బుకింగ్ ఫీజుపై జీఎస్టీలో సడలింపు కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఈ అద్భుతమైన చారిత్రక వేదికల్లో వేడుకలు జరుపుకోవాలనే ఆలోచన మీకు ఉందా?..
ఇదీ చదవండి : నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి


