మరిది పెళ్లి... డ్యాన్స్‌తో రచ్చచేసిన వదిన.. వైరల్‌ వీడియో | Viral Video: Bhabhi Ka Dance Performance For Devar At His Wedding | Sakshi
Sakshi News home page

మరిది పెళ్లి... డ్యాన్స్‌తో రచ్చచేసిన వదిన..వైరల్‌ వీడియో

Nov 4 2021 5:12 PM | Updated on Nov 5 2021 12:18 PM

Viral Video: Bhabhi Ka Dance Performance For Devar At His Wedding  - Sakshi

సాధారణంగా చాలా మంది పెళ్లిళ్లలో సరదాగా స్టెప్పులేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలా స్టెప్పులేసి .. ఎదుటి వారిపట్ల తమ ప్రేమను చాటుకుంటారు. ఇప్పటికే.. పెళ్లి వేడుకలో చేసిన అనేక డ్యాన్స్‌లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఒక వదిన తన మరిది పెళ్లిలో డ్యాన్స్‌చేసి.. మరిదిపట్ల తన ప్రేమను, అభిమానాన్నిచాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

సల్మాన్‌ఖాన్, మాధూరి దీక్షిత్‌ జంటగా నటించిన ‘హమ్‌ ఆప్‌కే హైకోన్‌’ సినిమాలోని ‘లోచలీ మై అప్‌నీ దేవర్‌కి బరాత్‌ లేకే’ అనే పాటను పెళ్లిలో.. ప్లే చేశారు.  ఆ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ కోసం అతని.. వదిన ఈ పాటపై సరదాగా స్టెప్పులేస్తుంది. అయితే, ఈ పెళ్లిలో కూడా ఒక మహిళ.. తన మరిది కోసం..  సరదాగా డ్యాన్స్‌ చేసింది. ఈ డ్యాన్స్‌లో ఆ మహిళ.. పాటకు తగ్గట్లుగా చక్కగా స్టెప్పులేసింది. తన వదిన చేస్తున్న డ్యాన్స్‌ చూసి.. కొత్త జంట ఆనందంతో చూస్తూ ఉండిపోయారు.

అదే విధంగా..  వివాహనికి వచ్చిన అతిథులు కూడా.. మహిళ డ్యాన్స్‌ చూసి చప్పట్లతో ఉత్సాహపరిచారు. తమ మొబైల్‌లో మహిళ డ్యాన్స్‌ను రికార్డు చేశారు. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్‌.. ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు..’, ‘ఆ మహిళ జోష్‌ చూస్తే.. మాకు ఒక స్టెప్‌ వేయాలనుంది..’  అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. 

చదవండి: Diwali 2021: ఈ మీమ్స్‌ చూస్తే.. నవ్వాపుకోలేరు!!

Advertisement
 
Advertisement
Advertisement