Diwali 2021: Soan Papdi Funny Memes Viral - Sakshi
Sakshi News home page

Diwali 2021: ఈ మీమ్స్‌ చూస్తే.. నవ్వాపుకోలేరు!!

Nov 4 2021 3:24 PM | Updated on Nov 4 2021 4:15 PM

Diwali 2021: Soan Papdi Funny Memes Viral - Sakshi

దీపావళి అంటే దీపాలతో వెలుగులు నింపే పండగ. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి, పూజలు, వ్రతాలు జరుపుకుంటారు. దీపావళి రోజు మిఠాయిలు పంచుకోవడం కూడా సంప్రదాయంగా వస్తుంది. సాధారణంగా దీపావళికి తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు యాజమాన్యాలు స్వీట్‌ బాక్స్‌ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తాయి. అయితే దీపావళి మిఠాయి అనగానే చాలామందికి సోన్ పాపిడి గుర్తుకు వస్తుంది!

దీపావళిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు సోన్‌పాపిడి బాక్స్‌లను కానుకగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ప్రస్తుతం ఈ దీపావళి పండగ సందర్భంగా కూడా స్వీట్లపై ఫన్నీ మీమ్స్‌, జోకులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల జోకులు, మీమ్స్‌తో ట్విటర్‌లో #SoanPapdi ట్రెండింగ్‌లో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement