రెప్పాపాటులో ఎంత ఘోరం.. గాజు డోర్‌ మీద పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి

Video: 3 Year Old Girl dies After Glass Door Falls On Her In Ludhiana - Sakshi

లుధియానా: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్లాస్‌ డోర్‌తో ఆడుకొంటున్న చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. భారీ గాజు తలుపు మీద పడటంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. లుధియానా ఘుమర్‌ మండి మార్కెట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఊహించని ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

వివరాలు.. మూడేళ్ల చిన్నారితో కలిసి ఓ కుటుంబం వస్త్ర దుకాణంలో కొనుగోలు కోసం వచ్చారు. తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమై ఉండగా.. చిన్నారి దుకాణం ఎంట్రన్స్‌ వద్ద ఉన్న తలుపు హ్యాండిల్‌ను పట్టుకొని అటు ఇటూ ఊగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్లాస్‌ డోర్‌ మొత్తం ఊడిపోయి అమాంతం ఆమెపై పడిపోయింది. బోల్టులు వదులుగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది.

వెంటనే గమనించిన తల్లిదండ్రులు, షోరూమ్‌ సిబ్బంది హుటాహుటిన బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అణ్యం పుణ్యం తెలియని చిన్నారిని, డోర్‌ బలితీసుకున్న దృశ్యాలు నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
చదవండి: Video: హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్‌ మిస్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top