
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన స్థానికులకు కలచివేసింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
డెహ్రాడూన్(Dehradun)లోని ముస్సోరీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అతి వేగంగా వస్తున్న లగ్జరీ కారు రోడ్డు పక్కగా నడుస్తున్న ఆరుగురు పాదచారులను వేగంగా ఢీకొంది. దీంతో వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం దరిమిలా కారు డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్ఎస్పీతో సహా ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
చండీగఢ్ రిజిస్ట్రేషన్ నంబర్(Chandigarh registration number) కలిగిన మెర్సిడెస్ కారును నడుపుతున్న డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ, రోడ్డుపై వెళుతున్న నలుగురు కార్మికులను, ఒక స్కూటర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, స్కూటర్‌పై వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోస్టుమార్టం కోసం నాలుగు మృతదేహాలను పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు క్షతగాత్రులను డూన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కారును నడిపిన వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌కు మళ్లీ అమెరికా ఆయుధాలు
Comments
Please login to add a commentAdd a comment