దుర్గా మండపంలో అమెరికా రాయబారి గార్సెట్టి డ్యాన్స్‌ | US Ambassador Eric Garcetti dances | Sakshi
Sakshi News home page

దుర్గా మండపంలో అమెరికా రాయబారి గార్సెట్టి డ్యాన్స్‌

Oct 23 2023 6:24 AM | Updated on Oct 23 2023 6:24 AM

US Ambassador Eric Garcetti dances - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఆదివారం హల్‌చల్‌ చేశారు. ఢిల్లీలోని సీఆర్‌ పార్కులో ఏర్పాటు చేసిన దుర్గా మండపానికి వెళ్లిన ఆయన..సంప్రదాయ ధునుచి డ్యాన్స్‌ చేసి, అందరినీ వినోద పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను గార్సెట్టి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

బెంగాలీ స్ట్రీట్‌ ఫుడ్‌ ఝల్మురితోపాటు కొన్ని రకాల బెంగాలీ స్వీట్లను రుచి చూసిన ఆయన ‘ధునుచి నాచ్‌’లో పాల్గొన్నారు. ఉత్సవంలో పాలుపంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ అందులో పేర్కొన్నారు. దుర్గా మాత మండపాల్లో సాధారణంగా చేసే నాట్యాన్ని ధునుచి నాచ్‌ అని పిలుస్తుంటారు. దేవతకు హారతి ఇచ్చేందుకు వాడే మట్టి పాత్రనే ధునుచి అంటారు.

Advertisement
 
Advertisement
Advertisement