సొలిసిటర్‌ జనరల్‌గా మళ్లీ తుషార్‌ మెహతా | Tushar Mehta re-appointed as Solicitor General for three years | Sakshi
Sakshi News home page

సొలిసిటర్‌ జనరల్‌గా మళ్లీ తుషార్‌ మెహతా

Jul 1 2023 6:17 AM | Updated on Jul 1 2023 6:17 AM

Tushar Mehta re-appointed as Solicitor General for three years - Sakshi

న్యూఢిల్లీ: సీనియర్‌ న్యాయవాది తుషార్‌ మెహతా భారత సొలిసిటర్‌ జనరల్‌గా మళ్లీ నియమితులయ్యారు. 2018లో మొదటిసారిగా సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన తుషార్‌ మెహతా పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది.

తాజాగా, మూడోసారి మరో మూడేళ్ల కాలానికి ఆయన్ను నియమిస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు సుప్రీంకోర్టుకు ఆరుగురు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ను మూడేళ్ల కాలానికి పునర్నియమించింది. వీరు..విక్రమ్‌జీత్‌ బెనర్జీ, కేఎం నటరాజ్, బల్బీర్‌సింగ్, ఎస్‌వీ రాజు, ఎన్‌ వెంకటరామన్, ఐశ్వర్య భాటి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement