Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Evening Headlines 25th May 2022 - Sakshi

1.. అమలాపురం అల్లర్లపై స్పీకర్‌ సీరియస్‌.. అప్పుడుంటది బాదుడే బాదుడు!


కోనసీమ దుర్ఘటన బాధాకరమని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం విచారం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడం నూటికి కోటి శాతం కరెక్టేనన్నారు. జిల్లాలకు మహానీయుల పేర్లు పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

2..మచిలీపట్నంలో ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌


దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే లక్ష కోట్లకు పైచిలుకు పెట్టుబడులు వచ్చాయి. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ స్వయంగా వివరిస్తున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. Salvador Ramos: టెక్సాస్‌ స్కూల్‌ నరమేధం.. పుట్టినరోజు నుంచే కిరాతకుడి ప్లాన్‌, జోకర్‌లాగే..


ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 19 మంది పిల్లలను, ఇద్దరు టీచర్లను!. పిల్లలని కూడా కనికరం లేకుండా కిరాతకంగా కాల్పులకు తెగబడ్డాడు సాల్వడోర్‌ రామోస్‌. ఎందరో కన్నతల్లులకు కడుపు కోత మిగిల్చాడు. కేవలం 18 ఏళ్ల కుర్రాడు.. ఇంత మారణహోమానికి పాల్పడడం సాధ్యమేనా? అసలు ఏ పరిస్థితులు అతనితో ఇంత దురాగతం చేయించాయి? ఘటనకు ముందు సోషల్‌ మీడియాలో అతను మెయింటెన్‌ చేసిన సస్పెన్స్‌ ఏంటంటే.. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. కాంగ్రెస్‌కు కపిల్‌ సిబల్‌ గుడ్‌బై.. ఎస్పీ తరపు రాజ్యసభకు నామినేషన్‌


సీనియర్‌ నేత, న్యాయకోవిదుడు కపిల్‌ సిబల్‌(73) కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్‌ వేసిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని ప్రకటించారు ఆయన. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. PM Modi Hyderabad Tour: ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (గురువారం) ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి మధ్యలో ఉన్న ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇవ్వాలని లేదా ఉద్యోగుల హాజరు సమయాలలో మార్పులు చేసుకోవాలని ఆయా కంపెనీలకు పోలీసులు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి]

6.. Samantha: 'డెడ్‌' అని సమంత పోస్ట్‌.. ఆ వెంటనే డిలీట్‌


 'థోర్'  ట్రైలర్‌ చూసిన సామ్‌ తన ఇన్‌స్టా గ్రామ్‌ స్టోరీలో 'డెడ్‌' అని రాస్తూ ఫైర్ ఎమోజీస్‌ను పెట్టి థోర్‌ సినిమా పోస్టర్‌ను షేర్‌ చేసింది. అయితే తర్వాత కొద్దిసేపటికి సామ్‌ స్టోరీలో ఆ పోస్టర్‌ కనిపించట్లేదు. దానికి బదులు 'థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌'లో సూపర్‌ విలన్‌గా నటిస్తున్న క్రిస్టియన్‌ బాలే లుక్‌ను షేర్‌ చేస్తూ 'ది గాడ్‌ ఆఫ్‌ యాక్టింగ్‌' అని రాసింది. ఈ పోస్ట్‌లు చూస్తుంటే సమంత కూడా ఈ సూపర్‌ హీరో సినిమాలకు విపరీతమైన అభిమానిగా తెలుస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. Rashid Khan: 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? చక్కగా నిద్రపో!


ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టి ఫైనల్లో అడుగుపెట్టింది గుజరాత్‌ టైటాన్స్‌. క్వాలిఫైయర్‌-1లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టును ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. దీంతో గుజరాత్‌ ఆటగాళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. Inspiration Jouney: కూతురి జుట్టు బాగా ఊడిపోవడం చూసి... ఇంటర్నెట్‌లో వెదికి.. వృద్ధ దంపతులు!


ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడూ ఏదోఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటిని ఎదిరించి నిలబడి పోరాడేవాళ్లే ముందుకు సాగగలుగుతారు. కొంతమంది సమస్యను కూకటివేళ్లతో పెకిలించి భవిష్యత్‌ తరాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఓ వృద్ధజంట ఈ జాబితాలో నిలిచారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. సామాన్యులకు శుభవార్త! వంట నూనెలలతో పాటు వీటి ధరలు తగ్గనున్నాయ్‌!


దేశ ప‍్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్రూడ్‌ సోయా బిన్‌ ఆయిల్‌, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌తో పాటు క్రూడ్‌ పామాయిల్‌పై డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ను, పాయిల్‌పై 10శాతం ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో రోజురోజూకీ  పెరుగుతున్న నూనె ధరలతో పాటు ఇతర వస్తువులు భారీగా తగ్గనున్నాయి.  
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

కలిసి చదువుకున్నారు.. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి..


సోషల్‌ మీడియాలో ప్రేమ పేరుతో యువతిని, ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తోన్న యువకుడిని కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోటి ఉమెన్స్‌ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తోన్న ఆదిత్య భరద్వాజ్, కరీంనగర్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీలో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top