Konaseema District Issue: అమలాపురం అల్లర్లపై స్పీకర్‌ సీరియస్‌.. అప్పుడుంటది బాదుడే బాదుడు!

AP: Speaker Tammineni Sitaram On Konaseema District Change Issue - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: కోనసీమ దుర్ఘటన బాధాకరమని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం విచారం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడం నూటికి కోటి శాతం కరెక్టేనన్నారు. జిల్లాలకు మహానీయుల పేర్లు పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. అంబేద్కర్‌ రాజ్యాంగం అనుభవిస్తూ ఆయన పేరును వ్యతికేరిస్తారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లాలో విలేకరుల సమావేశంలో స్పీకర్‌ బుధవారం మాట్లాడారు. కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని మండిపడ్డారు. 

‘అమలాపురం అల్లర్ల వెనుక ఎవురున్నారో త్వరలో తెలుస్తుంది. కుట్రవెనుక దాగి ఉన్న నిందితులను గుర్తించాకా.. అప్పుడుంటది బాదుడే బాదుడు. శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ 2 జిల్లాగా పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక న్యాయం జరిగింది’ అని స్పీకర్‌ పేర్కొన్నారు.
చదవండి: అమలాపురం ఘటన వెనుక కుట్ర ఉంది: మంత్రి బొత్స

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top