రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా.. | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా..

Published Fri, Mar 26 2021 8:06 PM

TNAssembly Elections: Actress Shakeela Joins In Conress Party - Sakshi

చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రసకందాయంగా మారాయి. పార్టీల విస్తృత ప్రచారంతో రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. తాజాగా ఓ హాట్‌ బ్యూటీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆలస్యంగానైనా ఓ పార్టీలో చేరారు. ఆమెనే అప్పటి తరాన్ని కవ్వించి సెగలు రేపిన నటి షకీలా. 200కు పైగా సినిమాల్లో నటించి.. శృంగార తారగా పేరుపొందిన షకీలా ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తారో వేచి చూడాలి.

దక్షిణాది భాషల్లో వందల సినిమాల్లో షకీలా నటించారు. కామెడీ పాత్రలతో పాటు హాట్‌ సీన్స్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో షకీలా పని చేయనున్నట్లు సమాచారం. షకీలా సినీ ప్రవేశం 18 ఏళ్ల వయసులో జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాలు చేశారు. ఆమె జీవితం ఆధారంగా గతేడాది ‘షకీలా’ సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.

చదవండి: ‘లేడీ సింగమ్‌’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు
చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..

 
Advertisement
 
Advertisement