‘లేడీ సింగమ్‌’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు

IFS Officer Harassment: Maharashtra Lady Singham Commits Suicide - Sakshi

ముంబై: అటవీ శాఖ అధికారిణి బలవన్మరణానికి పాల్పడడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఉన్నతాధికారి వేధింపులేనని తేలింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆమె తన సూసైడ్‌ నోట్‌లో తాను బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలను వివరించింది. ఆ వ్యక్తెవరో కూడా పేర్కొనడంతో అతడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటన అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె అటవీ మాఫియాకు ముచ్చెమటలు పట్టించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడడం కలచివేస్తోంది.

మహారాష్ట్రలో యంగ్‌ అండ్‌ డైనమిక్‌గా అధికారిణిగా దీపాలి చవాన్‌ మొహితే (28) గుర్తింపు పొందింది. లేడీ సింగమ్‌గా పేరు పొందారు. అయితే ఆమె అమరావతి జిల్లాలోని టైగర్‌ రిజర్వ్‌ సమీపంలోని హరిసాల్‌ గ్రామంలో ఉన్న అధికారిక నివాసంలో గురువారం సాయంత్రం దీపాలి తన సర్వీస్‌ రివాలర్వ్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అంతకుముందు ఆమె రాసిన లేఖ లభ్యమైంది. అందులో శివకుమార్‌ తనతో గడపాలని, అలా చేయకపోతే అదనపు డ్యూటీలు వేయడం.. వేధించడం చేసేవాడని వాపోయింది. దీంతోపాటు తాను గర్భిణిగా ఉన్న సమయంలో కొండల్లోకి లాక్కెళ్లాడని ఆరోపించింది. అతడి వలన తనకు గర్భస్రావం అయ్యిందని లేఖలో కన్నీటి పర్యంతమైంది. 

తనను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి తీవ్రంగా వేధించారని ఆరోపించింది. ఆయనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌ వినోద్‌ శివకుమార్‌ అని తెలిపింది. కొన్ని నెలలుగా ఆయన లైంగికంగా వేధించిన విషయాన్ని పూసగుచ్చినట్టు లేఖలో రాసింది. మానసికంగా కూడా చిత్రహింసలకు గురి చేశాడని వాపోయింది. అతడు తన అధికారాన్ని దుర్వినియోగంతో చేసిన కార్యాలను వివరించింది. ఆమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న వినోద్‌ శివకుమార్‌ పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..
చదవండి: వివాహేతర సంబంధం: మంచం కింద దాక్కొని హత్య

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top