స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నం | tiuvannamalai 17 year Old girl and what Happened to this boy friend in chennai old building | Sakshi
Sakshi News home page

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నం

Jun 3 2025 1:47 PM | Updated on Jun 3 2025 1:47 PM

tiuvannamalai 17 year Old girl and what Happened to this boy friend in chennai old building

అన్నానగర్‌: ఓ యువకుడు స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.  తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి చెన్నైలోని పూందమల్లిలో నివసిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇన్‌స్ట్రాగామ్‌ చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఉత్తర చెన్నైకి చెందిన సాయి (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి తల్లి తరచుగా కూతురిని మందలించింది. 

దీంతో ఆ బాలిక కొన్ని రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి, స్నేహితురాలి ఇంట్లో బస చేసింది. మళ్లీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ బాలిక తన ప్రియుడిని ఓ సారి కలిసి మాట్లాడాలని ప్లాన్‌ చేసుకుంది. ఆదివారం రా త్రి 11 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి చెన్నైలోని కొత్తవల్సావడి ప్రాంతంలోని ఒక భవనం వద్ద ప్రియుడిని కలవడానికి వెళ్లింది.

 ఆ సమయంలో సాయి స్నేహితులు రాహుల్‌ (26)సహా ఇద్దరు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై అక్కడికి వచ్చారు. హఠాత్తుగా సా యి, అతని స్నేహితులు కూడా ఆ బాలికను ఆ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ప్రయతి్నంచారు. ఆ ప్రాంత ప్రజలు దీనిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.  పోర్ట్‌ మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌  లక్ష్మీ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో యువకులు పారిపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement