కారు చీకటిలో పెద్దపులి.. వీడియో వైరల్‌! | Tiger Spotted Roaming Through Sugarcane Field In Night: Viral Video | Sakshi
Sakshi News home page

Tiger Spotted: కారు చీకటిలో పెద్దపులి

Published Wed, Oct 4 2023 11:09 AM | Last Updated on Wed, Oct 4 2023 11:24 AM

Tiger Spotted Roaming Through Sugarcane Field in Night - Sakshi

ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఇది ఊహకు వస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది.

కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ 17 సెకన్ల వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని తేరాయ్‌కు చెందినదని తెలుస్తోంది.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @prashant_lmp పేరుతో ఉన్న ఖాతాతో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన జనం తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియోను చూసినప్పుడు దీనిని వాహనంలో నుండి చిత్రీకరించారని గమనించవచ్చు. కారు బానెట్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

ఈ వీడియోను షేర్ చేసిన యూజర్‌ ‘ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లా తేరాయ్‌లోని కొన్ని చెరకు పొలాల్లో పులులు సరదాగా తిరుగుతాయి. ఈ వీడియో కుక్రా ప్రాంతానికి చెందినది’ అనిరాశారు. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌)అధికారి రమేష్ పాండే ..‘చెరకు పొలాలు అటు వేటగాళ్లకు, ఇటు వేటాడే క్రూర జంతువులకు ఇష్టమైన ప్రదేశం. అందుకే ఇటువంటి చోట్ల మనుషులు, క్రూరమృగాలు ఎదురుకావడం జరుగుతుంటుంది. శీతాకాలంలో ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయి. కారు హెడ్ లైట్ల కాంతి పెద్దపులిపై పడుతుండటం వీడియోలో కనిపిస్తుంది’ అని రాశారు.
ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్‌ రహీం వరకూ ఏం చదువుకున్నారు?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement