
ఢిల్లీః కేంద్ర జల సంఘం(సీడబ్యూసీ) చైర్మన్ అతుల్ జైన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డ, సమ్మక్క, సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై చర్చించారు.మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించారు. అదే సమయంలో సమ్మక్క, సారక్క, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల అంశాన్ని సైతం భేటీలో ప్రస్తావించారు. కృష్ణానది పై పలు చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు అంశాన్ని కూడా చర్చించారు.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. ‘మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీ లను పునరుద్ధరించాలా లేదా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేడిగడ్డ డిజైన్ ,. ఆపరేషన్ లోపాలు ఉన్నాయని ఎన్ డి ఎస్ ఏ నివేదిక స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రాజెక్ట్ పునరుద్ధరణ ఎలా చేయాలని మార్గాలు అన్వేషిస్తున్నాం. డీపీఆర్ లో చూపెట్టిన స్థలం వేరు. ఒక ప్రాంతంలో కడతామని మరో ప్రాంతంలో మేడిగడ్డ కట్టారు. మేడిగడ్డ , సుందిళ్ల బ్యారేజ్ ల విషయంలో సిడబ్ల్యుసి సంప్రదింపులతో ముందుకు వెళ్లాలని ఎన్డీఎస్సీ సూచించింది.
పాడైపోయిన మేడిగడ్డ , సుందిళ్ల బ్యారేజ్ లను ఎలా ముందుకెళ్లాలనిపై చర్చించా. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కడతాం. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టిఎంసిల నీటి కేటాయింపులు వేగంగా జరపాలని కోరా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీలు కోరుతున్నాం. వాటిలో తక్షణమే 45 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేశాను. అక్రమ నీటి తరలింపుకు చెక్ పెట్టేందుకు టెలిమెట్రీ పెట్టాలని కోరాం. పోలవరం బ్యాక్ వాటర్ తో ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దానికి రిటెన్షన్ వాల్ ను నిర్మించాలని అడిగాం’ అని ఉత్తమ్ తెలిపారు.