నీట్‌ పేపర్‌లీక్‌ సూత్రధారి నితీషే.. తేజస్వియాదవ్‌ | Tejashwi Yadav Sensational Allegations On Nitish Kumar In NEET Test | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌లీక్‌ సూత్రధారి నితీషే.. తేజస్వి సంచలన ఆరోపణలు

Published Fri, Jun 21 2024 7:01 PM | Last Updated on Fri, Jun 21 2024 8:14 PM

Tejaswi Yadav Sensation Allegations On Nitishkumar In Neet Test

పాట్నా: నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్‌లీక్‌లో తనను ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పేపర్‌లీక్‌లో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వియాదవ్‌ పీఏకు పరిచయం ఉందని బీజేపీ ఆరోపించింది. దీనిపై తేజస్వి స్పందిస్తూ నితీష్‌కుమార్‌పై ఆరోపణలు చేశారు. అసలు నీటి పేపర్‌ లీకేజీకి కుట్ర చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమారే అన్నారు. బీజేపీ బిహార్‌లో పవర్‌లోకి వచ్చినప్పుడల్లా పేపర్‌లీక్‌లు జరుగుతున్నాయన్నారు. 

నీట్‌ విషయంలో ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని కూటమి డిమాండ్‌ చేస్తోందన్నారు. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ‘ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలని చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. లీక్‌ వెనుక అసలైన సూత్రధారులు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్‌లే’అని తేజస్వి ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement