Tamil Nadu Assembly: కుల గణన చేపట్టండి | Tamil Nadu Assembly passes resolution in favour of caste census | Sakshi
Sakshi News home page

Tamil Nadu Assembly: కుల గణన చేపట్టండి

Jun 27 2024 5:45 AM | Updated on Jun 27 2024 12:26 PM

Tamil Nadu Assembly passes resolution in favour of caste census

తమిళనాడు అసెంబ్లీ తీర్మానం 

చెన్నై: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2021 నుంచి వాయిదాపడుతున్న జన గణనను వెంటనే చేపట్టాలని, ఇందులో భాగంగా కుల గణన కూడా చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో కోరారు. 

‘భారత్‌లోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా సమాన అవకాశాలు అందాలంటే కుల గణన తప్పనిసరి అని శాసనసభ భావిస్తోంది’ అని తీర్మానంలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement