కరోనా: తమిళనాడు మంత్రి కన్నుమూత | Tamil Nadu Agriculture Minister Dies With Corona | Sakshi
Sakshi News home page

కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత

Nov 1 2020 9:54 AM | Updated on Nov 1 2020 12:04 PM

Tamil Nadu Agriculture Minister Dies With Corona - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి దురైక్కన్ను(72) కన్నుమూశారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్వాస ఇబ్బందులతో గత నెల 13న చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దురైక్కన్ను చేరారు. అనంతరం అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్యం మరింత విషమించింది. ఈ క్రమం‍లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం  ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి మృతిపట్ల తిమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement