స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ  | Swiggy Instamart Launches 10-Minute LPG Cylinder Delivery | Sakshi
Sakshi News home page

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ 

Jul 16 2026 6:07 AM | Updated on Jul 16 2026 6:07 AM

Swiggy Instamart Launches 10-Minute LPG Cylinder Delivery

హెచ్‌పీసీఎల్‌తో భాగస్వామ్యం  

న్యూఢిల్లీ: స్విగ్గీకి చెందిన క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఇకపై ఎల్‌పీజీ సిలిండర్లను కూడా డెలివరీ చేయబోతున్నారు. ఇందుకోసం హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు స్విగ్గీ బుధవారం ప్రకటించింది. దీనిద్వారా హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన 10 కిలోల కాంపోజిట్‌ ఎల్పీజీ సిలిండర్‌ ‘హెచ్‌పీ నవ్య’కూడా ఇన్‌స్టామార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. 

గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ సర్వీసులు మొదట బెంగళూరులో అందుబాటులోకి వస్తాయి. అక్కడ వినియోగదారులు ‘హెచ్‌పీ నవ్య’ను ఆర్డర్‌ చేయవచ్చు. దీనితోపాటు 5 కిలోల మెటల్‌ ఎల్పీజీ సిలిండర్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ విధానం విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటుందని ఇన్‌స్టామార్ట్‌ వెల్లడించింది. ఇన్‌స్టామార్ట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వేగవంతమైన, సౌకర్యవంతమైన, డిజిటల్‌ విధానంతో కూడిన సేవలు అందిస్తామని హెచ్‌పీసీఎల్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ గార్గ్‌ చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement