
న్యూఢిల్లీ: పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతిని అరెస్టు చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఈ నేపధ్యంలో అతని ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిలో పలువురు యువతుల ఫొటోలతోపాటు, సిబ్బంది, విద్యార్థినులతో జరిపిన పలు రకాల వాట్సాప్ చాట్‌లు ఉన్నాయి. ఇవి పోలీసులను సైతం నివ్వెరరపోయేలా చేస్తున్నాయి.
ఎన్‌డీటీవీ అందించిన ఒక కథనంలోని వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి ఫోన్‌లో ఒక చాట్ అతని అంతర్జాతీయ నెట్ వర్క్‌ను తెలియజేస్తోంది. దీనిని పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఆ వాట్సాప్ చాట్‌లో చైతన్యానంద సరస్వతి దుబాయ్ షేక్ ‘అవసరం’ తీర్చేందుకు తన ఆధీనంలోని విద్యాసంస్థకు చెందిన విద్యార్థినితో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ బాబా: ‘దుబాయ్ షేక్ ఒకరు తనకు ‘పార్టనర్’ కావాలని అడుగుతున్నారు. అందుకు అనువుగా ఎవరైనా మంచి స్నేహితులు ఉన్నారా?"
విద్యార్థిని: ‘కోయీ నహీ హై’ (ఎవరూ లేరు)
ఢిల్లీ బాబా: ‘ఎందుకని?’
విద్యార్థిని: ‘నాకు తెలియదు’
ఢిల్లీ బాబా: ‘నీ క్లాస్‌మేట్ ఎవరైనా? జూనియర్?’
ఇతర చాట్‌లలో చైతన్యానంద పదే పదేపదే ఒక విద్యార్థిని ‘స్వీటీ బేబీ డాటర్ డాల్’ లాంటి పదాలలో సంబోధించాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చైతన్యానంద సరస్వతి చాట్ చేశాడు.
‘బేబీయ్’ (రాత్రి 7:49)
‘బేబీ నువ్వు ఎక్కడున్నావు?’ (రాత్రి 11:59)
‘గుడ్ మార్నింగ్ బేబీ’ (రాత్రి 12:40)
‘నా మీద నీకు ఎందుకు కోపం?’
మరో సందర్భంలో ఇలా చాటింగ్.. ‘గుడ్ ఈవెనింగ్ ..నాకు అత్యంత ప్రియమైన బేబీ డాటర్ డాల్’
విద్యార్థిని: ‘ఇది మధ్యాహ్నం సార్, హ్యాపీ గుడ్ ఆఫ్టర్ నూన్.. మీరు ఏదైనా తిన్నారా సార్?’
మరో చాట్‌లో చైతన్యానంద సరస్వతి ‘డిస్కో డ్యాన్స్ చేస్తున్నాను’ అంటూ నాతో జాయిన్ అవుతావా? అని అడుగుతాడు. ‘వావ్ సార్ ఆర్సమ్’ అంటూ విద్యార్థిని మర్యాద పూర్వకంగా సమాధానం ఇచ్చింది.
ఇంకో చాట్‌లో చైతన్యానంద సరస్వతి ఒక విద్యార్థినితో ‘నువ్వు నాతో పడుకుంటావా?’ అని అడిగాడు.
17 మంది విద్యార్థులను వేధించాడనే ఆరోపణలతో చైతన్యానందను ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా తప్పించుకుని బృందావన్, మధుర, ఆగ్రాలలో చైతన్యానంద సరస్వతి తిరుగుతూ వచ్చాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి సెప్టెంబర్ 27న పార్థ సారథి అనే పేరుతో ఆగ్రాలోని ఒక హోటల్‌లో బస చేశాడు. అక్కడే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.