‘ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే | Sakshi
Sakshi News home page

‘ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే

Published Thu, Mar 21 2024 3:30 PM

Supreme Court stays Centre Notification of Fact Check Unit - Sakshi

ఢిల్లీ: కేంద్రం విడుదల చేసిన ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది.  ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది. ఫేక్‌ న్యూస్‌ను అడ్డుకునేందుకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్‌ చెక్‌ (నిజనిర్ధారణ)’ యూనిట్‌కు సంబంధించి కేంద్ర ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలిసిందే.

కాగా కేంద్ర ఐటీ శాఖ ఫ్యాక్ట్ చెక్‌ యూనిట్‌ను నోటిఫై చేయగా.. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ‘ద ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగాన్ని నోటిఫై చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ‘ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే గురువారం దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్ నోటిఫికేషన్‌పై స్టే విదిస్తున్నట్లు పేర్కొంది.

ఆన్‌లైన్‌ కంటెంట్‌లో ఫేక్‌, తప్పుడు  సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో  పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనికోసం ఐటీ రూల్స్‌-2021కి కూడా కేంద్రం సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యంగ  విరుద్ధంగా ఉన్నాయిని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యాక్ట్‌ ​చెక్‌ యూనిట్ ఏర్పాటుపై మధ్యంత స్టే ఇవ్వడానికి ముంబై హైకోర్టు నిరాకరించింది.

ముంబై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ  జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 11 ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. అయితే బాంబే హైకోర్టు ముందుకు వచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సి అవసంరం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. అంతవరకు మార్చి 20 (బుధవారం) కేంద్రం జారీ చేసిన నోటిఫికేష్‌పై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement
Advertisement