Supreme Court Key Reference On GO Number-1, Details Inside - Sakshi
Sakshi News home page

ఏపీ: జీవో నంబర్‌-1పై సుప్రీంకోర్టు కీలక సూచన

Apr 24 2023 1:31 PM | Updated on Apr 24 2023 1:45 PM

Supreme Court Key Reference On GO Number-1 - Sakshi

సాక్షి, ఢిల్లీ: జీవో నంబర్‌-1పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాగా, విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.  జోవో నంబర్‌-1పై ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తుది తీర్పు త్వరగా ఇచ్చేలా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

కాగా, ఏపీలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో-1 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీవో నంబర్‌-1పై విపక్షాలు హైకోర్టులో సవాల్‌ చేశాయి. దీంతో, జనవరి 24న విచారణ ముగించి ఏపీ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇక, హైకోర్టులో తీవ్ర జాప్యం నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement