మహువా మెయిత్రా పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ | Sakshi
Sakshi News home page

మహువా మెయిత్రా పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ

Published Fri, Dec 15 2023 10:52 AM

Supreme Court To Hear Mahua Moitra Plea Lok Sabha Expulsion - Sakshi

ఢీల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. క్యాష్ ఫర్ క్వారీ ఆరోపణలతో తన ఎంపీ సభ్యత్వం రద్దును సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. కేంద్రంపై విమర్శలు చేయడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం చేసుకున్నట్లు మెయిత్రాపై ఆరోపణలు వచ్చాయి.   

కేంద్రం, ‍అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదటిసారి పార్లమెంట్‌లో ఈ ఆరోపణలు చేశారు.  ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో పెద్ద చర్చే జరిగింది. ఈ అంశం చివరికి ఎథిక్స్ కమిటీకి చేరింది. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడగడానికి మహువా అనైతిక చర్యకు పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ నిర్దారిచింది. మెయిత్రా తన లోక్‌సభ పోర్టల్ లాగిన్ వివరాలను వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో పంచుకున్నట్లు ఎథిక్స్ కమిటీ గుర్తించింది.

ఈ 'క్యాష్-ఫర్-క్వారీ' కుంభకోణంలో ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. దీంతో డిసెంబర్ 8న ఆమె తన ఎంపీ పదవిని రద్దు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. ఎథిక్స్ కమిటీ తన వాదనను వినిపించుకోలేదని మహువా ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఎంపీ పదవి రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. 

ఇదీ చదవండి: పార్లమెంట్‌ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు

Advertisement
Advertisement