ఆ 60 కేజీల వెండి ఎక్కడ? | Status of over 40-kg silver donated to Ram temple not known | Sakshi
Sakshi News home page

ఆ 60 కేజీల వెండి ఎక్కడ?

Jun 21 2026 4:46 AM | Updated on Jun 21 2026 4:46 AM

Status of over 40-kg silver donated to Ram temple not known

అయోధ్య రామాలయానికి విరాళంగా ఇచ్చిన వెండి గల్లంతు

లక్నో: అయోధ్యలోని రామమందిరం నిర్మాణం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు స్వయంగా వచ్చి దానమిచ్చిన విరాళాల నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నడుమ మరో కొత్త ఆరోపణ మొదలైంది. ప్రధాన ఆలయ గర్భగుడిలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజున రామ్‌లల్లాకు తాము సమర్పించిన 60 కేజీల వెండి వస్తువుల ఆచూకీపై ఆలయ నిర్వాహకులు ఎలాంటి సమాధానం చెప్పట్లేరని ఇండియా బులియన్‌ అండ్‌ జువెల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనురాగ్‌ రస్తోగీ వెల్లడించారు. 

4.62 కేజీల బరువైన నాలుగు పెద్ద వెండి ఇటుకలు, 34.64 కేజీల బరువైన 30 వెండి వస్తువులు సహా మొత్తంగా 60 కేజీల వెండిని విరాళం ఇచ్చినట్లు రసీదుల్లో స్పష్టంగా ఉంది. కానీ ఆలయ విరాళాల లెక్కలు, రికార్డుల ప్రకారం ఈ వెండి, వెండి వస్తువులు ఎక్కడున్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే వివాదం మొదలవడంతో ఏర్పాటైన ప్రత్యేకదర్యాప్తు బృందం(సిట్‌) సభ్యులు గత ఆరు రోజులుగా వెతుకుతున్నా వీటి జాడ ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. విచారణలో భాగంగా అధికారులు రామ్‌లల్లాలో బంగారం, విరాళాల బాధ్యతలు చూసుకుని రాంశంకర్‌ యాదవ్‌ అలియాస్‌ టిన్ను, కృష్ణదేవ్‌ తివారీ, మరో నలుగురు పూజారులను ప్రశ్నించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement