సోనియా గాందీకి అస్వస్థత  | Sonia Gandhi taken to Shimla hospital after high blood pressure complaint | Sakshi
Sakshi News home page

సోనియా గాందీకి అస్వస్థత 

Jun 8 2025 5:52 AM | Updated on Jun 8 2025 5:52 AM

Sonia Gandhi taken to Shimla hospital after high blood pressure complaint

సిమ్లా:  కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ(78) అస్వస్థతకు గురయ్యారు. కుమార్తె ప్రియాంక గాందీతో కలిసి గత సోమవారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాకు వ్యక్తిగత పర్యటన కోసం వచి్చన సోనియా శనివారం ఒక్కసారిగా అధిక రక్తపోటుకు గురయ్యారు. 

దాంతో ఆమెను చికిత్స కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి మీడియా సలహాదారు నరేశ్‌ చౌహాన్‌ చెప్పారు. కొన్ని పరీక్షల అనంతరం సోనియా గాంధీ డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. ప్రియాంక గాం«దీకి సిమ్లా శివారులోని చరబ్రలో సొంత ఇల్లు ఉంది. తల్లికుమార్తెలు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement