లండన్‌కు స్మృతి ఇరానీ.. ‘మోదీ 3.0’ విజయోత్సవాలకు హాజరు | Smriti Irani Went To London, Why? | Sakshi
Sakshi News home page

లండన్‌కు స్మృతి ఇరానీ.. ‘మోదీ 3.0’ విజయోత్సవాలకు హాజరు

Jun 24 2024 11:41 AM | Updated on Jun 24 2024 11:59 AM

Smriti Irani why Went to London

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వారిలో స్మృతి ఇరానీ ఒకరు. ఓటమి తర్వాత ఆమె చాలా అరుదుగా బహిరంగంగా కనిపించారు. ఈ నేపధ్యంలో స్మృతి ఇరానీ ప్రస్తుతం ఎక్కడున్నారని చాలామంది ‍ప్రశ్నిస్తున్నారు.

మీడియాకు అందిన సమాచారం ‍ప్రకారం బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ‘మోడీ 3.0’ విజయోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్మృతీ ఇరానీ లండన్ చేరుకున్నారు. అక్కడి అభిమానులు ఆమెకు ఘస స్వాగతం పలికారు. ఈ సమయంలో పలు దేశభక్తి నినాదాలు చేశారు.

స్మృతి ఇరానీ  సభలో మాట్లాడుతూ తనకు ఇక్కడ బెంగాలీ, గుజరాతీ స్నేహితులు ఉన్నారని తెలిపారు. తరువాత మలయాళంలో మాట్లాడుతూ కేరళకు చెందినవారిని పలుకరించారు. అలాగే మహారాష్ట్ర ప్రజలను మరాఠీలో పలకరించారు. ఈ సమయంలో అక్కడున్న వారిలో కొందరు జై మహారాష్ట్ర, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్మృతి మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతుల మిళితం అని, తాను భారతీయురాలిని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement