బీజాపూర్: చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు బీజాపూర్ నేషనల్ పార్క్ ఏరియాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి జరిపిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయాన్ని బీజాపూర్ ఎస్పీ డా. జితేంద్ర యాదవ్ వెల్లడించారు.
ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు మావోయిస్టులు సంచరిస్తున్న విషయాన్ని అందుకున్న బీజాపూర్, దంతేవాడ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టామని, ఈ క్రమంలోనే తమకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులను మట్టుబెట్టినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి స్టెన్ గన్స్, ఆటోమేటిక్ వెపన్స్, రైఫిల్స్, ఇతర మారణాయుధాలను, భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్ల పేర్కొన్నారు.


