Mysterious: Search, Unlock And Download Buttons Seen In The Dustbin Of Some Cities, Video Viral - Sakshi
Sakshi News home page

Search Unclock Buttons In Trash Bins: చెత్త డబ్బాలో ‘సెర్చ్‌’,‘అన్‌లాక్‌’,‘డౌన్‌లోడ్‌’.. ఎందుకిదంతా జరుగుతోంది?

Published Thu, Jul 13 2023 7:50 AM

search unlock and download buttons seen in the dustbin - Sakshi

ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటలైజ్‌ అయిపోయింది. ముఖ్యంగా పట్టణాల్లో దీని ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. నగర ప్రజలు అన్నింటికీ డిజిటల్‌ లావాదేవీలనే కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఈ ధోరణికి మరింత ఊతమిస్తోంది. చివరికి టెక్నాలజీ లేకుంటే అడుగు కూడా ముందుకు పడదేమోనని అనిపించే రోజుల్లో మనిషి బతికేస్తున్నాడు. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన ఫొటోలు, వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. 
 

ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.  ఒక పబ్లిక్‌ ప్లేస్‌లోని చెత్తడబ్బాలలో ఇంటర్నెట్‌కు సంబంధించిన మూడు బటన్లు కనిపిస్తున్నాయి. ‘డౌన్‌లోడ్‌’, ‘అన్‌లాక్‌’, ‘సెర్చ్‌’ బటన్‌ల పేర్లతో ఉన్న ఈ బోర్డులు అందరినీ తెగ ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఈ బటన్లను ఇక్కడ ఎందుకు పడవేశారనే ఆలోచన అందరిలో కలుగుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఈ పట్టణంలో డిజిటల్‌ డిటాక్స్‌’ విషయమై ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు చెత్తకు, టెక్నాలజీకి సంబంధం ఏమిటంటున్నారు. కాగా ఈ ‘డౌన్‌లోడ్‌’, ‘అన్‌లాక్‌’, ‘సెర్చ్‌’ బటన్‌లు దేశంలోని కొన్ని పట్టణాల్లోని చెత్తడబ్బాల్లో కనిపించాయని సమాచారం. 

సోషల్‌ మీడియాలో ఈ  ఉదంతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ‘డౌన్‌లోడ్‌’, ‘అన్‌లాక్‌’, ‘సెర్చ్‌’ బటన్‌లు మొబైల్‌ వినియోగంలో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. డిజిటలైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఎవరో ఈ చర్యకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు. 
 

ఇది కూడా చదవండి: విచిత్ర ఫ్యామిలీ: ఆ కుటుంబంలోని తొమ్మదిమందీ ఒకేరోజు పుట్టారు!

Advertisement
Advertisement