
వృద్ధులు, యువత మధ్య పెరుగుతున్న దూరం
గౌరవంతోపాటు చులకన భావమూ ఉంటోంది
‘డిజిటల్’కు దూరంగా ఉంటున్న పెద్దలు
హెల్పేజ్ ఇండియా తాజా అధ్యయనం వెల్లడి
డైనింగ్ టేబుల్‌పై నోరూరించే వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓ తాత, ఆయన మనవడు.. నిశ్శబ్దంగా సాగుతోంది వారి భోజనం. తనతో ఈరోజైనా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆ పెద్దాయన ఎదురు చూపులు. 21 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం తన ప్రపంచంలో తాను ఫోన్ లో ఎప్పటిలాగే నిమగ్నమయ్యాడు. ఇద్దరిదీ ఒకేగూడు.. అయినా ఇరువురి మధ్య దూరం. ఇలాంటి దృశ్యాలు.. ఏ ఒక్క కుటుంబానికో పరిమితం కాలేదు. దేశంలోని లక్షలాది ఇళ్లల్లో ఇదే పరిస్థితి.
దేశ జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయసు గల యువత దాదాపు 29% ఉన్నారని అంచనా. అంటే దాదాపు 42 కోట్ల మంది! ఈ ఏడాది చివరినాటికి దేశ జనాభాలో 60 ఏళ్లు, ఆపై వయసుగలవారు 12 శాతం వరకు ఉంటారు. 2050 నాటికి ఇది 19 శాతానికి చేరుతుంది. వీరి జనాభా 25 ఏళ్లలో రెండింతలవుతుందని అంచనా. ఇది మనదేశంలో రెండు ప్రధాన తరాల ముఖ చిత్రం.
మనసుల మధ్య ఎడం
సాధారణంగా తరాల మధ్య అంతరం ఉంటుంది. కానీ, ఇటీవల వ్యక్తుల మధ్యే కాదు.. మనసుల మధ్య కూడా ఎడం ఉంటోంది. జనరేష¯Œ –జడ్.. పెద్దలను గౌరవిస్తారు. కానీ ఒంటరి వారని, తమపై ఆధారపడతారన్న చులకన భావమూ ఉంటోందని సుప్రసిద్ధ ఎన్జీవో ‘హెల్పేజ్ ఇండియా’ దేశవ్యాప్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. పెద్దలతో యువతరానికి ఉన్న పరిమిత బంధాలు, కుటుంబాల్లో మూస పద్ధతులు.. వెరసి అభిమానం ఉన్నా ఇరువురి మధ్య దూరం ఉంటోందని వివరించింది. తరాలున్న కుటుంబాల్లో 18–24 ఏళ్ల వయసున్న యువతకు.. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలతో ఆత్మీయ అనుబంధం ఎక్కువ.
వృద్ధులతో యువత ఎలా మమేకం అవుతున్నారంటే..
