సీఈసీ, ఈసీల నియామకంపై మే14న సుప్రీం విచారణ | SC fixes May 14 for hearing pleas against appointment of CEC, ECs | Sakshi
Sakshi News home page

సీఈసీ, ఈసీల నియామకంపై మే14న సుప్రీం విచారణ

Apr 17 2025 5:47 AM | Updated on Apr 17 2025 5:47 AM

SC fixes May 14 for hearing pleas against appointment of CEC, ECs

న్యూఢిల్లీ: 2023 చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), ఎన్నికల కమిషనర్లు(ఈసీల) నియామకాలను చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

ఈ అంశంపై సత్వరం విచారణ చేపట్టాలంటూ సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వినతి మేరకు బుధవారం జస్టిస్‌ సూర్య కాంత్, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 19న సుప్రీంకోర్టు ప్రకటించిన విధంగా వాస్తవానికి ఈ పిటిషన్లపై బుధవారమే విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే, భూ సేకరణకు సంబంధించిన కీలకమైన అంశాలున్నందున వాయిదా వేయాల్సి వచ్చిందని ధర్మాసనం తెలిపింది. మే 14వ తేదీన తప్పక విచారిస్తామంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement