ఇంఫాల్: హిందువులు ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భగవత్. భారత నాగరికత ఇప్పటి వరకు నిలిచింది.. భవిష్యత్‌లోనూ ఉంటుంది. ఇప్పటికే పలు దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. కానీ మన భారతదేశ నాగరికత అమరమైందని వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన తర్వాత ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తొలిసారిగా అక్కడ పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. భారతదేశ నాగరికత ఎప్పటికీ అలాగే ఉంటుంది. హిందువులు ఉనికి కోల్పోతే.. ప్రపంచానికే ఉనికి ఉండదు. ప్రతిఒక్కరూ మారుతున్న పరిస్థితుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే భారత సమాజంలో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల హిందూ సమాజం ఉండి తీరుతుంది. సమాజానికి ఏం కావాలో దాన్ని హిందూ సమాజం సాధిస్తుంది. అది ఈశ్వరుడి కర్తవ్యం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమా దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు.
మరోవైపు.. అమెరికా సుంకాల విధింపు విషయమై ఆయన స్పందిస్తూ..‘దేశ నిర్మాణానికి బలం చాలా అవసరమన్నారు. బలం అంటే ఆర్థిక సామర్థ్యం అని చెప్పుకొచ్చారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎవరిపైనా ఆధారపడకూడదని సూచించారు. ఇది కష్టతరమైనది ఏం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. చివరగా.. నక్సలిజాన్ని సమాజం అంగీకరించబోదని.. అది ముగిసిన అధ్యయనం అని తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఉదాహరణగా ఉదహరించారు. భారతదేశంలో బ్రిటిష్ సూర్యుడు అస్తమించాడని చెప్పారు.
#WATCH | Imphal, Manipur | RSS Chief Mohan Bhagwat says, "Everyone needs to think about circumstances. But you see, circumstances change. Every nation of the world has seen all kinds of situations. Some nations perished. Yunaan (Greece), Misr (Egypt) and Roma, all civilisations… pic.twitter.com/w14gUyC0iS
— ANI (@ANI) November 21, 2025


