
జైపూర్: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రారంభానికి సిద్దంగా ఉన్న రాష్ట్ర రహదారి వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రహదారి నిర్మించిన కాంట్రాక్టర్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో కొత్తగా నిర్మించిన రాష్ట్ర రహదారి వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉదయపూర్వతిలోని బఘులి అనే ప్రాంతం గుండా వెళ్ళే కట్లి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ ప్రాంతంలో 86 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో, వరద ప్రవాహం ధాటికి రోడ్డు కొట్టుకుపోయింది. రహదారిని గండిపడిపోయింది.
కట్లి నది.. సికార్ ఝుంఝును, చురు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ నదిలో ఆక్రమణలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే భారీ వర్షాల సమయంలో వరదలు సంభవించి రహదారులు కోతకు గురవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, రోడ్డు కొట్టుకుపోయిన విషయం తెలియడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అక్కడికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🔴 Rajasthan Shocker | Heavy rains wash away newly built road in Jhunjhunu just days after completion.
Locals outraged, question quality of construction and demand accountability from officials.
pic.twitter.com/xafp8RHgIA— The News Drill (@thenewsdrill) July 8, 2025