
మనం బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా దానిపై అందుకు తగ్గ సౌకర్యం లేకపోతే చిరాకు వస్తుంది. ఏసీ బస్సుల్లో కానీ, ఏసీ ట్రైన్‌లలో కానీ ఏసీ రాకపోతే ఏం చేస్తే.. కాపేపు చూస్తాం.. ఆపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ కూడా అదే జరిగింది. లక్నో-బారౌనీ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఏసీ-2 టైర్ తీసుకుంటే అందులో ఏసీ సరిగ్గా పని చేయడం లేదు. కూలింగ్ చాలా తక్కువగా ఉందని కంఫ్లైట్ రైజ్ చేశారు ప్రయాణికులు.
దాంతో ట్రైన్‌ను ముందస్తు షెడ్యూల్ అనేది లేకుండా చెక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ ఏసీ 2 టైర్ కోచ్‌లో ఏసీ రాకపోవడానికి ప్రధాన కారణం తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ఆ ఏసీ డక్ట్‌లో లిక్కర్ బాటిళ్లను దాచి పెట్టడమే అని కనుగొన్నారు అధికారులు. తనిఖీలు చేసే క్రనంలో పేపర్లతో కట్టిన రెండు బండిల్స్ బయటపడ్డాయి. వాటిని తెరిచి చూడగా అందులో లిక్కర్ బాటి్ళ్లు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై సోనాపూర్ డీఆరర్‌ఎమ్ స్పందిచారు. ‘ ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఆ అక్రమ లిక్కర్‌ను సీజ్ చేశాం. కూలింగ్ లేదని విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన ప్రయాణికులు ధన్యవాదాలు’ అని తెలిపారు.
Passengers complained of low cooling in the AC coach of Lucknow-Barauni Express. When the technicians inspected the AC duct, consignment of a illict liquor was being hidden there.
Tecnologia! pic.twitter.com/Qad9Uis9dO— Piyush Rai (@Benarasiyaa) August 14, 2025