ఒక సాధారణ రెస్టారెంట్ లంచ్ అనుకోని విధంగా ఓ చిన్నారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చింది. కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుక కోసం బయటకు వెళ్లిన ఆ బాలుడు, అదే రెస్టారెంట్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్న ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది..
డాక్టర్ ఎస్.జె.టి కజ్మీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి లంచ్‌కు వెళ్లారు. అయితే అదే హోటల్‌కు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాళ్లకు దగ్గర్లోనే ఓ టేబుల్ మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఉత్సాహంగా ఉన్న చిన్నారి రాహుల్ గాంధీకి చేతులు ఊపగా.. ఆయన స్పందించి బాలుడిని తన వద్దకు పిలిచారు.
ఆప్యాయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆ చిన్నారితో ఫోటో దిగుతూ అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని కజ్మీ తన పోస్టులో పేర్కొన్నారు. “నా కుమారుడికి ఇది జీవితంలోనే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్” అంటూ ఆయన మరో పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది వినియోగదారులు రాహుల్ గాంధీ చేసిన ఈ సింపుల్ గెస్టర్‌ను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు.
Was out for lunch on my Son’s Birthday today . As luck would have it Rahul Gandhi ji @RahulGandhi and Priyanka ji @priyankagandhi were at nearby table with family . My son waived at him in excitement , Mr Gandhi called him and made his birthday memorable !! Thank you sir ! pic.twitter.com/J6l5AjtwSl
— DR.S.J.T.KAZMI (@JAFARKAZMI) June 7, 2026
మరో వినియోగదారు డాక్టర్ రాకేష్ బన్సాల్ కూడా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. రాహుల్ గాంధీ చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. కుటుంబ వేడుకలో భాగమైనట్టే ఆయన ఫోటోలకు పోజ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం హృదయాన్ని హత్తుకునే అనుభవమని అభిప్రాయపడ్డారు.
सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।
उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।
मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते… pic.twitter.com/vjNNVItc2q— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2026
సార్ధక్ ది గ్రేట్!
సీబీఎస్‌ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్, అతని సహచరి నిసర్గపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాజాగా వాళ్లు పేరెంట్స్‌తో కలిసి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరి ప్రయత్నం వల్ల వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇటు సీబీఎస్‌ఈ అధికారులు రీవ్యాల్యుయేషన్ ప్రక్రియలో ఉన్న సమస్యలను అంగీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.


