ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన.. రాహుల్‌ గాంధీ రియాక్షన్‌.. | Rahul Gandhi Reacts To Delhi Coaching Centre Incident | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన.. రాహుల్‌ గాంధీ రియాక్షన్‌..

Jul 28 2024 4:16 PM | Updated on Jul 28 2024 5:32 PM

Rahul Gandhi Reacts To Delhi Coaching Centre Incident

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.

ఢిల్లీ: ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించకుంటున్నారని మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా సివిల్స్‌ శిక్షణా కేంద్రంలోకి వరద పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాల పట్ల రాహుల్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘‘ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లో నీరు చేరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరం. గతంలో వర్షాలకు విద్యుత్‌ షాక్‌ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటన వ్యవస్థల  వైఫల్యం. అసురక్షిత నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్య పౌరులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతీ పౌరుడి హక్కు. దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత’’ అంటూ రాహుల్‌ ట్విట్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement