రైల్వే కూలీగా రాహుల్ గాంధీ | Rahul Gandhi Coolie Moment On Visit To Delhi Station | Sakshi
Sakshi News home page

రైల్వే కూలీగా రాహుల్ గాంధీ.. స్టేషన్‌లో మూటలు మోస్తూ..

Sep 21 2023 2:43 PM | Updated on Sep 21 2023 2:54 PM

Rahul Gandhi Coolie Moment On Visit To Delhi Station - Sakshi

ఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. కూలీ నెం.1లో వెంకటేశ్‌లా కనిపించారు. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఎర్రని చొక్కా ధరించి నెత్తిన లగేజ్ పెట్టుకుని మోశారు. రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే కనిపించి  అభిమానులను అలరించారు.  రాహుల్ చిరునవ్వులు చిందుతూ రైల్వే కూలీలా మూటలు మోస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రైల్వే కూలీలను కలిసి వారితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కూలీలు చేసే పనిని స్వయంగా చూసి తాను కూడా మూటలు మోశారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ అక్కడ ఉన్న కూలీలు నినాదాలు చేశారు. ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. భారత్ జోడో యాత్ర నడుస్తుందని స్పష్టం చేసింది.  

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి కూడా 1983 చిత్రం మజ్దూర్‌లోని "హమ్ మెహనత్‌కాష్ ఈజ్ దునియా సే" పాటతో రైల్వే స్టేషన్‌లో రాహుల్ గాంధీ బ్యాగులు లాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. యువనేత పోస్ట్‌కు "ప్రజానాయకుడు" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఇదీ చదవండి: Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement