అమెరికాలోనూ నిరసనలు జరుగుతుంటాయి  | Protests also take place in America says US Secretary of State Marco Rubio | Sakshi
Sakshi News home page

అమెరికాలోనూ నిరసనలు జరుగుతుంటాయి 

Oct 22 2026 6:37 AM | Updated on Oct 22 2026 6:37 AM

భారత్‌లో నిరసనలు దేశ అంతర్గత రాజకీయ వ్యవహారం  

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడి  

ముంబై: భారత్‌లో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనలపై వ్యాఖ్యానించడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిరాకరించారు. ఈ అంశాన్ని భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారంగా అభివర్ణించారు. ఆయన బుధవారం ముంబైలో మాట్లాడారు. నిరసనలపై ఐక్యరాజ్యసమితి నిపుణుల విమర్శలను సైతం కొట్టిపారేశారు. 

భారత్‌లో ప్రతిపక్షాలు, విద్యార్థులు చేస్తున్న నిరసనలు దేశ అంతర్గత వ్యవహారమని, ఈ అంశంలో తాను జోక్యం చేసుకోనని తేల్చిచెప్పారు. భారత్‌ ఒక ప్రజాస్వామ్య దేశం, అక్కడ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అంతర్గత రాజకీయ విషయాలపై తాను ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయనని అన్నారు. ఇది భారత ప్రజలే నిర్ణయించుకోవాల్సిన, పరిష్కరించుకోవాల్సిన అంశమని స్పష్టంచేశారు.

 అమెరికాలో కూడా ప్రతిరోజూ నిరసనలు జరుగుతుంటాయని, ఇవి రాజకీయ చర్చలకు, భిన్నాభిప్రాయాలకు ప్రతిబింబమని రూబియో వివరించారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ప్రజలు బయటకు వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారంటే.. అక్కడ రాజకీయ చర్చలకు, భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉందని అర్థం అని రూబియో తేల్చిచెప్పారు.  

విభిన్నంగా భారత్‌ అమెరికా వాణిజ్య ఒప్పందం: ట్రంప్‌ 
వాషింగ్టన్‌: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని, అయితే ఈ ఒప్పందం గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ‘‘వాళ్లు ఒప్పందం కావాలంటున్నారు. చేసుకుంటున్నాం. చాలా దగ్గరకు వచ్చేశాం’’అంటూ ఆయన వాషింగ్టన్‌లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఇప్పటివరకూ ఎన్నడూ జరగని రీతిలో ఈ ఒప్పందం భిన్నంగా ఉండబోతోంది’’అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement