రోడ్డెక్కిన విద్యార్థులు | Thousands of students and teachers took to the streets across Greece | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన విద్యార్థులు

Oct 22 2026 6:23 AM | Updated on Oct 22 2026 6:23 AM

Thousands of students and teachers took to the streets across Greece

మద్దతిచ్చిన టీచర్లు

గ్రీస్‌లో ఆందోళనలు ముమ్మరం

ఏథెన్స్‌: చుక్కలనంటుతున్న నిత్యావసరాలు, విద్యా రంగంలో అవ్యవస్థ తదితరాలపై గ్రీస్‌లో రాజుకున్న అగ్గి నానాటికీ పెరిగి పెద్దదవుతోంది. నిరసనకారులు బుధవారం దేశవ్యాప్తంగా కదం తొక్కారు. విద్యా రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల పెంపు, విద్యార్థులకు చౌక ధరల్లో ఆవాస సదుపాయం తదితర డిమాండ్ల సాధనకు విద్యార్థులతో పాటు ఏకంగా టీచర్లు కూడా రోడ్లెక్కారు! రాజధాని ఏథెన్స్‌ వీధుల్లోనైతే వేలాది సంఖ్యలో ప్రదర్శనలకు దిగారు. థెస్సలోనికి, పాత్రాస్‌ తదితర గ్రీస్‌ నగరాల్లో కూడా ఇవే దృశ్యాలు దర్శనమిచ్చాయి. పలుచోట్ల టీచర్లు రోజంతా సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు! 

‘గ్రీస్‌ నుంచి ఫ్రాన్స్‌ దాకా: చదువుకు ఆర్థిక చేయూతనివ్వండి’, ‘చదువు కోసం, మనుగడ కోసం’అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. ప్రభుత్వం అందజేసే సబ్సిడీ కనీసం నెలవారీ అద్దెలో సగం కూడా కట్టడానికి చాలడం లేదంటూ విద్యార్థులు ఈ సందర్భంగా వాపోయారు. ముందుజాగ్రత్త చర్యగా నిరసనలు, ప్రదర్శనల వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆయా దారుల్లో దుకాణాలు తదితరాలను ముందే మూసి ఉంచారు. ఆందోళనకారులతో పాటు పాదచారుల బ్యాగులు తదితర వస్తువులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement