ఫలించిన విట్‌కాఫ్ దౌత్యం
నవంబర్ పది తరువాత చర్చలు
ఇరాన్ యుద్ధంపై చర్చకూ పుతిన్ సుముఖత
మాస్కో: రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధానికి తెరపడే దిశగా తొలి అడు గు పడింది. నవంబర్ నెల పదవ తేదీ తరువాత ఉక్రెయిన్‌తో చర్చ లు పునరుద్ధరించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైద్ధాంతికంగా అంగీకారం తెలిపినట్లు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ బుధవారం ప్రకటించారు. అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్‌కాఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య సెయింట్ పీటర్స్‌బెర్గ్‌లో చర్చల అనంతరం యూరి ఉషకోవ్ విలేకరులతో మాట్లాడారు.
త్రైపాక్షిక చర్చలు ఘర్షణలు ముగిసిన తరువాత రష్యా, ఉక్రెయిన్లు వ్యవస్థల నిర్మాణంపై దృష్టి పెడతాయని తెలిపారు. దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధాన్ని నిలిపివేసే దిశగా ఒక ఒప్పందం కుదర్చడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా ప్రయతి్నస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క యుద్ధాన్ని ముగించమని ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకొస్తూనే మరోవైపు విట్‌కాఫ్ ద్వారా పుతిన్‌తో చర్చలు కొనసాగిస్తున్నారు ట్రంప్.
ఈ నేపథ్యంలోనే బుధవారం సుమారు 3 గంటలపాటు పుతిన్, విట్‌కాఫ్‌ల మధ్య జరిగిన చర్చలకు ప్రాధాన్యమేర్పడింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్‌స్టాంటిన్ ప్యాలెస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా ప్రతినిధి విట్‌కాఫ్ సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ఉషకోవ్, రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రియెవ్ కూడా పాల్గొన్నారు. వీడియో లింక్ ద్వారా ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా పాల్గొన్నట్లు విట్‌కాఫ్ తెలిపారు.
ఓస్లోలో జరిగిన సమావేశం వివరాలను పుతిన్‌కు తెలియజేసినట్లు చెప్పారు. చర్చల సందర్భంగా అమెరికా–రష్యా ఆర్థిక సంబంధాల పునరుద్ధరణ అవకాశాలతోపాటు ఇరాన్ యుద్ధంపై కూడా చర్చించేందుకు పుతిన్ సుముఖత వ్యక్తం చేశారని, ఇరాన్‌తోతమకున్న ప్రత్యేక సంబంధాల సాయంతో శాంతిని నెలకొల్పేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ చెప్పారని విట్‌కాఫ్ తెలిపారు. యుద్ధ విరమణ కోసం చొరవ తీసుకుంటున్నందుకు ట్రంప్, విట్‌కాఫ్‌లకు పుతిన్ కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.


