కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు | Prime Minister Narendra Modi Sensational Comments On Kancha Gachibowli Lands | Sakshi
Sakshi News home page

కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Apr 14 2025 3:00 PM | Updated on Apr 14 2025 4:47 PM

Prime Minister Narendra Modi Sensational Comments On Kancha Gachibowli Lands

హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్‌ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు

135వ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ హర్యానా రాష్ట్రం, యమునా నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని పాలనని ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజల ఆందోళనతో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు  వెళ్తోంది. వికసిత్‌ భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం
ప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చింది. ఈ తరుణంలో కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ స్పందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement