వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం | Prime Minister Modi Condoles the death of Vanajeevi Ramaiah | Sakshi
Sakshi News home page

వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం

Apr 12 2025 1:47 PM | Updated on Apr 12 2025 5:28 PM

Prime Minister Modi Condoles the death of Vanajeevi Ramaiah

న్యూఢిల్లీ, సాక్షి: సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య(85) మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన సేవలను కొనియాడారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపం తెలియజేశారు. ఈ మేరకు తెలుగులో ఓ పోస్ట్‌ ఉంచారాయన.

‘‘దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. 

వనజీవి రామయ్య మృతిపై  PM మోదీ సంతాపం

దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ.. నలుగురితో మొక్కలు నాటిస్తూ.. వైవిధ్యమైన రీతిలో ప్రచారంతో హరిత ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో కోటి మొక్కలకు పైనే నాటి అరుదైన ఘనత సాధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.

Advertisement
 
Advertisement
Advertisement