
ఆదివారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ నివాసంలో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము. చిత్రంలో ప్రధాని నరేంద్రమోదీ
బీజేపీ దిగ్గజ నేత నివాసంలో అందజేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజం, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) భారత రత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు పురస్కారాన్ని అందజేశారు.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అద్వానీకి భారతరత్న ప్రదాన కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ప్రత్యేకమైన సందర్భమని మోదీ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారతరత్న ప్రదాన సమయంలో కూర్చోని ఉండటం ద్వారా రాష్ట్రపతిని మోదీ ఘోరంగా అవమానించారని కాంగ్రెస్ మండిపడింది