ఇంకెంతకాలం తప్పించుకుంటారు?: ప్రకాశ్ రాజ్ | How long will you escape from Citizens dissent: Prakash Raj | Sakshi
Sakshi News home page

ఇంకెంతకాలం తప్పించుకుంటారు?: ప్రకాశ్ రాజ్

Oct 10 2026 8:12 PM | Updated on Oct 10 2026 8:16 PM

How long will you escape from Citizens dissent: Prakash Raj

కార్టూనిస్ట్ సతీశ్ ఆచార్య రూపొందించిన కార్టూన్‌ను సినీనటుడు ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. పౌరుల నిరసనల నుంచి ప్రభుత్వం ఇంకెంతకాలం తప్పించుకుంటుందని ప్రశ్నించారు. అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకున్న తీరుపై ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వంటి ఉద్యమ నాయకులను విమానాశ్రయాల్లోనే అదుపులోకి తీసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతను విమానాశ్రయాలు, ఇళ్ల వద్దే నిర్బంధించి నిరసన ప్రదేశానికి చేరుకోనివ్వకపోవడాన్ని ప్రశ్నించారు.

“మీరు మా గళాలను అరెస్టు చేయలేదు.. మిమ్మల్ని మీరే అరెస్టు చేసుకున్నారు. ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని అంతం చేయనివ్వదు. ఇది సుదీర్ఘ పోరాటం. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆట మొదలైంది.. దేశం గమనిస్తోంది” అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: అందుకే జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు: నితిన్‌ నబీన్‌

అనురాగ్ కశ్యప్‌ ఘాటు వ్యాఖ్యలు
దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ కూడా నిరసనకారులకు మద్దతుగా స్పందించారు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. “ఇద్దరు పిరికివాళ్లు, 40 వేల మంది బానిసలు, లక్షలాది మంది ధైర్యవంతులు” అని పేర్కొన్నారు. మరో పోస్టులో అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా నిర్వహిస్తున్న ప్రత్యక్ష ప్రసారాన్ని ఫాలో కావాలని కోరారు. ఢిల్లీలోని ఢిల్లీ హాట్‌ వద్ద నిరసన చేపట్టిన నేహాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement