ప్రజ్వల్‌ రేవణ్ణ సోదరుడిపై లైంగిక ఆరోపణలు.. బెదిరింపులపై ఫిర్యాదు Prajwal Revanna Brother Claims Being Threatened With False Abuse Case. Sakshi
Sakshi News home page

ప్రజ్వల్‌ రేవణ్ణ సోదరుడిపై లైంగిక ఆరోపణలు.. బెదిరింపులపై ఫిర్యాదు

Published Sat, Jun 22 2024 8:54 AM | Last Updated on Sat, Jun 22 2024 10:52 AM

Prajwal Revanna Brother Claims Being Threatened With False Abuse Case

బెంగళూరు:  జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక ఆరోపణల కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆయన సోదరుడు సూరజ్‌ రేవణ్ణపై ఓ యువకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పోలీసులకు లేఖ రాశారు. దీనిపై సూరజ్ రేవణ్ణ స్నేహితుడు శివకుమార్‌ సదరు యువకుడితో పాటు మరో వ్యక్తిపై హసన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘చేతన్‌,  అతని బావ  ఇద్దరూ  న​న్ను కలిశారు. వారు నా  దగ్గర రూ. 5 కోట్లు డిమాండ్‌ చేశారు. వారు కోరినట్లు రూ. 5 కోట్లు ఇవ్వకపోతే.. సూరజ్‌ రేవణ్ణపై లైంగిక దాడి కేసు నమోదు చేస్తామని బెదిరించారు’ అని శివకుమార్‌  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

చేతన్‌ ముందు తననను కలిసి.. ఉద్యోగం ఇప్పించటం కోసం సాయం చేయాలని కోరాడని శివకుమార్‌ తెలిపారు. దీంతో నేను సూరజ్‌ రేవణ్ణ ఫోన్‌ నంబర్‌ ఇచ్చాను. అతనికి ఉద్యోగం ఇప్పించనందుకే తమ ఇద్దరినీ (శివకుమార్‌, సూరజ్‌ రేవణ్ణ)ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఫోలీసులకు శివకుమార్‌ ఫిర్యాదు చేశారు.

మరోవైపు.. చేతన్‌ సైతం ఓ ప్రైవేట్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సూరజ్‌ రేవణ్ణ తనను ఆయన ఫామ్ హౌజ్‌లో లైంగిక వేధింపులుకు గురిచేశాడని ఆరోపించారు. ఇక.. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణను జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకున్న కొన్ని రోజులకే ఓ యువకుడు అతని సోదరుడు సూరజ్‌ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు రావటం రాజకీయం తీవ్ర చర్చనీయాంశం అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement