18న పీఎం కిసాన్‌ నిధుల విడుదల | PM Narendra Modi to release Rs 20000 cr for farmers on 17 june 2024 | Sakshi
Sakshi News home page

18న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

Published Sun, Jun 16 2024 6:21 AM | Last Updated on Sun, Jun 16 2024 6:21 AM

PM Narendra Modi to release Rs 20000 cr for farmers on 17 june 2024

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసే పీఎం కిసాన్‌ పథకం నిధులు ఈ నెల 18న విడుదల కానున్నాయి.ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో నిధులను విడుదల చేయనున్నారు.

 దేశవ్యాప్తంగా 9.26 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ శనివారం ఈ విషయం వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement