పపువా న్యూ గినియా విపత్తుపై ప్రధాని మోదీ ట్వీట్‌ | Pm Modi Tweet On Papua New Guinea | Sakshi
Sakshi News home page

పపువా న్యూ గినియా విపత్తుపై ప్రధాని మోదీ ట్వీట్‌

May 28 2024 3:27 PM | Updated on May 28 2024 3:33 PM

Pm Modi Tweet On Papua New Guinea

న్యూఢిల్లీ: పపువా న్యూగినియాలో ఇటీవల కొండచరియలు విరిగిపడి భారీ విపత్తు సంభవించింది. ఈ విపత్తు కారణంగా 2000 మంది దాకా శిథిలాల కింద కూరుకుపోయారు. ఇంకొన్నివేల మంది నిరాశ్రయులయ్యారు.

తాజా దీనిపై ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. ‘న్యూగినియాలో జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నా. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రభావితమైన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా.

గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గినియా దేశానికి ఎలాంటి  సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నా’అని ప్రధాని  ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement